- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓటర్లు 9,45,094 మంది
- ఖమ్మం జిల్లా ఓటర్లు 11,96,293 మంది
- రెండు జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21లక్షల41వేల387 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. బుధవారం జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను కలెక్టర్లు ప్రకటించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 9లక్షల45వేల094 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఇందులో మగవారు 4లక్షల61వేల315మంది, మహిళలు 4లక్ష83వేల741 మంది, ట్రాన్స్ జెండర్లు 38మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. దివ్యాంగ ఓటర్లు 14,130 మంది, 80 ఏండ్లు నిండిన ఓటర్లు 13,082 మంది ఉన్నట్లు చెప్పారు.
1,095 పోలింగ్కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా పాల్వంచ మండలంలో 85,785 మంది, అతి తక్కువగా ఆళ్లపల్లి మండలంలో 8,491 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11లక్షల 96వేల293 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్వి.పి.గౌతమ్తెలిపారు. ఇందులో మగవారు 5 లక్షల 80 వేల 441 మంది, మహిళలు 6లక్షల15 వేల 807 మంది, ట్రాన్స్ జెండర్లు 75 ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,439 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.